విషాదాంతంగా ముగిసిన ప్రేమ వ్యవహారం | woman commits suicide over love affair | Sakshi
Sakshi News home page

విషాదాంతంగా ముగిసిన ప్రేమ వ్యవహారం

Jun 13 2014 9:30 AM | Updated on Nov 6 2018 7:53 PM

విషాదాంతంగా ముగిసిన ప్రేమ వ్యవహారం - Sakshi

విషాదాంతంగా ముగిసిన ప్రేమ వ్యవహారం

హైదరాబాద్ తిరుమలగిరిలో ఓ ప్రేమ వ్యవహారం విషాదాంతంగా ముగిసింది.

హైదరాబాద్ : హైదరాబాద్ తిరుమలగిరిలో ఓ ప్రేమ వ్యవహారం విషాదాంతంగా ముగిసింది. లోతుకుంటలోని సరస్వతీనగర్ నివాసి భాగ్యశ్రీ రెడ్డి ఓ ప్రయివేట్ పాఠశాలలో టీచర్. సంవత్సర కాలంగా ఆమె వైజాగ్కు చెందిన గీతాకృష్ణతో ప్రేమ వ్యవహారం కొనసాగింది.  భాగ్యశ్రీ బీఎస్సీ కంప్యూటర్స్‌ చదువుతుండగా.. గీతాకృష్ణ ఎంటెక్‌ చేస్తున్నాడు. అయితే వీరి ప్రేమను గీతాకృష్ణ పేరెంట్స్‌ అంగీకరించలేదు. ఆరు నెలలుగా తనను పెళ్లి చేసుకోవాలని అతనిపై భాగ్యశ్రీ ఒత్తిడి తీసుకు రావటంతో  గీతాకృష్ణ కనిపించకుండా పోయాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె చున్నీతో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

కాగా  పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకుంటానన్న గీతాకృష్ణ మాట మార్చడంతోనే తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని భాగ్యశ్రీ తల్లిదండ్రులు ఆరోపించారు. గీతాకృష్ణపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. గీతాకృష్ణ తనను మోసం చేశాడంటూ భాగ్యశ్రీరెడ్డి రాసిన సూసైడ్‌ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement