బీజేపీ అవినీతిపై ప్రచారం చేస్తాం | V Hanumantha rao takes on BJP | Sakshi
Sakshi News home page

బీజేపీ అవినీతిపై ప్రచారం చేస్తాం

Aug 14 2015 6:10 PM | Updated on Sep 19 2019 8:28 PM

బీజేపీ ప్రచారానికి దీటుగా తాము కూడా బీజేపీ అవినీతిపై ప్రచారం చేస్తామని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు తెలిపారు.

హైదరాబాద్ : బీజేపీ ప్రచారానికి దీటుగా తాము కూడా బీజేపీ అవినీతిపై ప్రచారం చేస్తామని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు  వి.హనుమంతరావు తెలిపారు. అవినీతికి వ్యతిరేకంగా పార్లమెంట్‌లో కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తే ప్రజాస్వామ్యాన్ని కాలరాసినట్లుగా ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలో ప్రచార కార్యక్రమాలను చేపట్టడం కంటే సిగ్గుచేటు మరొకటి ఉండదని ఆయన బీజేపీ నాయకులపై ధ్వజమెత్తారు.

శుక్రవారం గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... వ్యాపం, లలిత్‌మోడీ కేసుల్లో బీజేపీ అక్రమాలకు పాల్పడిందని ఆయన ఆరోపించారు. కేంద్రమంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంల అవినీతిపై పార్లమెంట్‌లో తమ పార్టీ నిలదీస్తే అప్రజాస్వామ్యమని బీజేపీ నేతలు అంటున్నారని విమర్శించారు.

కులం, మతం పేరుతో బీజేపీ రాజకీయాలు చేస్తోందన్నారు. ఏపీకీ ప్రత్యేకహోదా కోసం పోరాటం చేయాలని తమ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీని తాను కోరినట్లు వి.హనుమంతరావు ఈ సందర్భంగా చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదాపై ప్రజలకు హామీలిచ్చి మోసం చేశాయంటూ బీజేపీ, టీడీపీపై వి.హనుమంతరావు నిప్పులు చెరిగారు.

Advertisement
 
Advertisement
Advertisement