అమరనాథ్‌లో చిక్కుకున్న 100 మంది తెలుగు వారు | two telugu state people troubled in amarnath yatra | Sakshi
Sakshi News home page

అమరనాథ్‌లో చిక్కుకున్న 100 మంది తెలుగు వారు

Jul 27 2015 6:32 AM | Updated on Sep 3 2017 6:16 AM

అమరనాథ్‌లో చిక్కుకున్న 100 మంది తెలుగు వారు

అమరనాథ్‌లో చిక్కుకున్న 100 మంది తెలుగు వారు

తెలుగు రాష్ట్రాలకు చెందిన సుమారు వంద మందికి పైగా భక్తులు అమర్ నాథ్ యాత్రలో చిక్కుకుపోయారు

మణుగూరు/రాజమండ్రి: తెలుగు రాష్ట్రాలకు చెందిన సుమారు వంద మందికి పైగా భక్తులు అమర్ నాథ్ యాత్రలో చిక్కుకుపోయారు. ఖమ్మం జిల్లా మణుగూరు మండలం తోగ్గూడెం గ్రామానికి చెందిన ముగ్గురు అమర్‌నాథ్ యూత్రకు వెళ్లి మార్గమధ్యలో చిక్కుకున్నారు. తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు వీరంకి వెంకట్రావ్, అతని భార్య న్యాయవాది వీరంకి పద్మావతి, ఆమె సోదరుడు మురళీ ఈనెల 19న అమరనాథ్ యాత్రకు మణుగూరు నుంచి బయలు దేరారు. ఇక్కడి నుంచి ఢిల్లీ వరకు రైలు మార్గంలో వెళ్లిన వారు అక్కడ నుంచి హరికేష్ ట్రావెల్స్ ద్వారా ప్రయూణిస్తున్నారు. శ్రీనగర్ భాల్‌థార్ మధ్యన తోన్ మార్గంలో కొండచరియలు విరిగి పడటంతో వారు భాల్‌థార్‌లోనే ఉండిపోయూరు.

వీరితోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంకు చెందిన 100 మంది అక్కడ ఉన్నారని, రెండు రోజులుగా అక్కడి ప్రభుత్వ ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని పద్మావతి ఆదివారం రాత్రి సాక్షి’కి ఫోన్‌చేసి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం తమకు తీసుకెళ్లేప్రయత్నం చేయూలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement