కేసీఆర్ మాటలపై అసదుద్దీన్ స్పష్టతనివ్వాలి: రేవంత్ | TTDP leader Revanth Reddy comments on KCR | Sakshi
Sakshi News home page

కేసీఆర్ మాటలపై అసదుద్దీన్ స్పష్టతనివ్వాలి: రేవంత్

Jun 17 2016 1:36 AM | Updated on Aug 15 2018 9:30 PM

కేసీఆర్ మాటలపై అసదుద్దీన్ స్పష్టతనివ్వాలి: రేవంత్ - Sakshi

కేసీఆర్ మాటలపై అసదుద్దీన్ స్పష్టతనివ్వాలి: రేవంత్

టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు టీడీపీ కుట్ర చేసిందని ఈ విషయం తనకు ఎంఐఎం నేత అసదుద్దీన్ చెప్పారని...

సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు టీడీపీ కుట్ర చేసిందని ఈ విషయం తనకు ఎంఐఎం నేత అసదుద్దీన్ చెప్పారని పేర్కొన్న సీఎం కేసీఆర్ మాటలపై అసదుద్దీన్ స్పష్టతనివ్వాలని టీటీడీపీ నేత రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీఆర్‌ఎస్ అధికారంలోకి రాకుండా చంద్రబాబు కుట్ర చేసి ఉంటే కేసీఆర్ అమరావతికి ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. సాగునీటి ప్రాజెక్టులు, హైకోర్టు విభజన అంశాలపై గవర్నర్ వద్ద చర్చించడానికి  తమ నేత చంద్రబాబు వస్తారని, కేసీఆర్ తేదీని నిర్ణయించాలని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement