breaking news
TTDP leader Revanth Reddy
-
కొత్త జిల్లాల మాటున కుట్ర
టీటీడీపీ నేత రేవంత్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాల మాటున దాగిన కుట్ర గురించి కేంద్ర ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని టీటీడీపీ నేత రేవంత్‌రెడ్డి తెలిపారు. జిల్లాల విభజన పేరుతో నియోజకవర్గాల డీలిమిటేషన్‌పై ప్రభావం చూపేలా సీఎం కేసీఆర్ చేస్తున్న కుట్ర గురించి కేంద్ర హోంశాఖకు, న్యాయశాఖకు వివరిస్తామన్నారు. తమ పార్టీ నేతలు దసరా తర్వాత ఢిల్లీ వెళ్లి కేంద్రానికి ఫిర్యాదు చేస్తారని తెలిపారు. కేంద్రం నుంచి సానుకూల స్పందన రాకపోతే అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని చెప్పారు. పరిపాలనా సౌలభ్యం పేరుతో సీఎం కేసీఆర్ చట్టాలను ఉల్లంఘిస్తున్నారని, ఎదిగివస్తున్న ఎస్సీ, ఎస్టీ నాయకత్వాన్ని అణచి వేయడానికి, తనకు అడ్డంకిగా ఉన్న నేతలను దెబ్బతీయడానికి జిల్లాల పేరుతో కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కొత్త జిల్లాల వ్యవహారంలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కూడా కేసీఆర్‌తో కుమ్మక్కైందని ఆరోపించారు. అసెంబ్లీని వాయిదా వేసి కొత్త జిల్లాలకు సీఎం ఏర్పాటు చేస్తుంటే నిలదీసి పోరాటం చేయాల్సిన కాంగ్రెస్ నాయకులు ఆయనకు వంతపాడుతున్నారన్నారు. రాష్ట్ర పునర్విభజన చట్టం తయారు చేయించిన కాంగ్రెస్ నాయకులు రాష్ర్టంలోనే ఉన్నారని, ఈ చట్టానికి వ్యతిరేకంగా కేసీఆర్ చర్యలు తీసుకుంటుంటే ఎందుకు నోరు విప్పడం లేదని రేవంత్ ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి స్పందించాలని డిమాండ్ చేశారు. కొత్త జిల్లాల ప్రాతిపదికన డీలిమిటేషన్ జరిగితే దాని ప్రభావం రిజర్వ్డ్ నియోజకవర్గాలపై పడుతుందన్నారు. డీలిమిటేషన్‌పై ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం చూసినా ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు, పంచాయతీల సరిహద్దులు మార్చడానికి వీలులేదన్నారు. డీలిమిటేషన్‌కు ముం దుగానే సరిహద్దులు, పరిధిని మార్చడం ద్వారా తాను అనుకున్న విధంగా నియోజకవర్గాల రిజర్వేషన్లు వచ్చేలా కుట్ర పన్నారని ఆరోపించారు. గీతారెడ్డి, దామోదర రాజనర్సింహ, భట్టివిక్రమార్క, సండ్ర వెంకటవీరయ్య వంటి కొందరి నియోజకవర్గాలు ఎస్సీల నుంచి జనరల్‌గా మారిపోతాయన్నారు. -
డీపీఆర్‌లు లేకుండా టెండర్లు పిలవచ్చా?
టీటీడీపీ నేత రేవంత్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: తాము చేస్తున్న దోపిడి బయటపడుతుందన్న ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు పాలమూరు, డిండి ప్రాజెక్టుల సవివరమైన నివేదికల (డీపీఆర్)ను కృష్ణా నదీ జలాల నిర్వహణ బోర్డుకు ఇవ్వడం లేదని తెలంగాణ టీడీపీ నేత రేవంత్‌రెడ్డి ఆరోపించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పాలమూరు ప్రాజెక్టుకు రూ. 35 వేల కోట్లతో, డిండి ప్రాజెక్టుకు రూ. 6 వేల కోట్లతో టెండర్లు పిలిచారని చెప్పారు. ఈ ప్రాజెక్టుల డీపీఆర్‌లు లేకుండానే టెండర్లు పిలవచ్చా అని ఆయన ప్రశ్నించారు. పాలమూరు-రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులకు చంద్రబాబు వ్యతిరేకి అంటూ కేసీఆర్ మందిమాగధులు ప్రచారం చేస్తున్నారన్నారు. నీటి లభ్యత లేకుండా కమీషన్లకు కక్కుర్తిపడి అడ్డగోలుగా ప్రాజెక్టులు నిర్మిస్తే ఎవరూ ఊరుకోరన్నారు. -
కేసీఆర్ మాటలపై అసదుద్దీన్ స్పష్టతనివ్వాలి: రేవంత్
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు టీడీపీ కుట్ర చేసిందని ఈ విషయం తనకు ఎంఐఎం నేత అసదుద్దీన్ చెప్పారని పేర్కొన్న సీఎం కేసీఆర్ మాటలపై అసదుద్దీన్ స్పష్టతనివ్వాలని టీటీడీపీ నేత రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్ అధికారంలోకి రాకుండా చంద్రబాబు కుట్ర చేసి ఉంటే కేసీఆర్ అమరావతికి ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. సాగునీటి ప్రాజెక్టులు, హైకోర్టు విభజన అంశాలపై గవర్నర్ వద్ద చర్చించడానికి తమ నేత చంద్రబాబు వస్తారని, కేసీఆర్ తేదీని నిర్ణయించాలని అన్నారు.