కారుకు పంపాల్సిన చలానా బైక్‌కు..
కొండనాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్న చందంగా మారింది. ట్రాఫిక్ పోలీసుల ఈ –చలానాల జారీ ప్రక్రియ. కారు
బంజారాహిల్స్: కొండనాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్న చందంగా మారింది. ట్రాఫిక్ పోలీసుల ఈ –చలానాల జారీ ప్రక్రియ. కారు యజమానికి పంపించాల్సిన ఈ–చలానాను బైక్ యజమానికి పంపించి అయోమయంలో పడేశారు. వివరాల్లోకి వెళ్తే... మహంకాళి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గాస్‌మండి చౌరస్తాలో టీఎస్ 02 ఈఎల్ 5969 మారుతి కారు అక్రమంగా పార్కింగ్ చేయడంతో ఇందుకు సంబంధించిన ఈ–చలానాను బంజారాహిల్స్‌కు చెందిన ద్విచక్ర వాహనదారుడు టీఎస్ 05 ఈఎల్ 5969 ప్యాషన్ ప్రో హీరో బైక్ యజమానికి పంపారు. గురువారం చలాన్ అందడంతో ఆందోళనకు గురైన అతను దానిని పరిశీలించగా, తన బైక్ నంబర్‌తో ఉన్న మారుతీ కారుగా తేలింది.


