తెలంగాణ ప్రజలకు పౌర, ప్రజాస్వామిక హక్కులను గ్యారంటీ చేస్తామని రాష్ట్ర సాధన ఉద్యమంలో వాగ్దానం చేసి..
న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి డీవీ కృష్ణ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రజలకు పౌర, ప్రజాస్వామిక హక్కులను గ్యారంటీ చేస్తామని రాష్ట్ర సాధన ఉద్యమంలో వాగ్దానం చేసి.. అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం, ఎమర్జెన్సీని తలపించేలా నిర్బంధ చర్యలకు పూనుకోవడం దురదృష్టకరమని సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ పేర్కొంది. తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ (టఫ్) కార్యాలయంపై పోలీ సులు దాడి చేసి, మహిళా కార్యకర్తలను బయటకు పంపి బలవంతంగా మూసి వేయడాన్ని ఆ పార్టీ ఖండించింది. టఫ్ కార్యాలయాన్ని వెంటనే దాని బాధ్యులకు అప్పగించాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి డి.వి.కృష్ణ డిమాండ్ చేశారు.
టఫ్ నాయకులు, ఇతర ప్రజాసంఘాల నాయకులు హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, డీజీపీ అనురాగ్‌శర్మలను కలిసినపుడు, వెంటనే దాన్ని తెరిపించి అప్పగిస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. కానీ, ఎన్నోరోజులు గడిచినా అమలు చేయకపోవడం పట్ల ఆ పార్టీ నిరసనను ప్రకటించింది. కాగా, ప్రముఖ పాత్రికేయులు వి.హనుమంతరావు మృతి పట్ల న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి డి.వి.కృష్ణ సంతాపం ప్రకటించారు.