ఇంట్లో వారంతా కింద..దొంగలు పైన.. | Theft in Hyderabad | Sakshi
Sakshi News home page

ఇంట్లో వారంతా కింద..దొంగలు పైన..

Apr 1 2016 7:11 PM | Updated on Sep 4 2018 5:07 PM

ఆ భవనంలోని వారంతా కింది అంతస్తులో పడుకున్నారని తెలిసిన దొంగలు..పై అంతస్తులో ఉన్న సొత్తును మూటగట్టుకుపోయారు.

ఆ భవనంలోని వారంతా కింది అంతస్తులో పడుకున్నారని తెలిసిన దొంగలు..పై అంతస్తులో ఉన్న సొత్తును మూటగట్టుకుపోయారు. నల్లకుంట పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎస్సై సుధాకర్‌రెడ్డి తెలిపిన వివరాలు.. తూర్పు గోదావరి జిల్లా అంబాజీ పేటకు చెందిన జి.శ్రీనివాస్(50) కుటుంబం న్యూనల్లకుంట బాయమ్మలేన్‌ను నివాసముంటున్నారు.

పై అంతస్తులో ఉన్న ఏసీ పనిచేయక పోవడంతో కుటుంబ సభ్యులతో కలిసి గురువారం రాత్రి గ్రౌండ్ ఫ్లోర్‌లో పడుకున్నారు. అర్ధరాత్రి ఆ ఇంట్లోకి ప్రవేశించిన గుర్తు తెలియని ఆగంతకులు పైఅంతస్తులోని గది తాళం పగుల గొట్టి అల్మారాలో మూడున్నర తులా బంగారు ఆభరణాలు, ఒక వెండి గిన్నె ఎత్తుకు పోయారు. శుక్రవారం ఉదయం బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 

Advertisement
 
Advertisement
Advertisement