ఉస్మానియా లేడీస్ హాస్టల్‌లో సమస్యలను పరిష్కరించాలని కోరుతూ విద్యార్థినులు శుక్రవారం సాయంత్రం ఆందోళనకు దిగారు.
ఉస్మానియా లేడీస్ హాస్టల్‌లో సమస్యలను పరిష్కరించాలని కోరుతూ విద్యార్థినులు శుక్రవారం సాయంత్రం ఆందోళనకు దిగారు. ఆహారంలో పురుగులు, కలుషిత మంచినీరు, అరకొర భద్రత ఏర్పాట్లపై వారు నిరసించారు. మెస్ కాంట్రాక్టర్ అమర్‌సింగ్‌ను తొలగించాలని డిమాండ్ చేశారు. చీఫ్‌వార్డర్‌కు, డెరైక్టర్లకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని ఆరోపించారు. విద్యార్థినులు రోడ్డుపై ఆందోళనకు దిగటంతో వర్సిటీ ప్రధాన మార్గంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.