డబుల్ బెడ్ రూమ్ పథకంలో టాటా గ్రూప్ | Tata group interested on double bedroom scheme in telangana | Sakshi
Sakshi News home page

డబుల్ బెడ్ రూమ్ పథకంలో టాటా గ్రూప్

Feb 8 2016 4:47 PM | Updated on Sep 29 2018 4:44 PM

డబుల్ బెడ్ రూమ్ పథకంలో టాటా గ్రూప్ - Sakshi

డబుల్ బెడ్ రూమ్ పథకంలో టాటా గ్రూప్

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూమ్ పథకంలో భాగస్వామ్యం అయ్యేందుకు టాటా గ్రూప్ అంగీకరించిందని మున్సిపల్, ఐటీ, పంచాయతీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు.

ముంబై: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూమ్ పథకంలో భాగస్వామ్యం అయ్యేందుకు టాటా గ్రూప్ అంగీకరించిందని మున్సిపల్, ఐటీ, పంచాయతీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. సోమవారం ఆయన ముంబైలో టాటా గ్రూప్ ఛైర్మన్ సైరస్ మిస్త్రీతో భేటీ అయ్యారు.

హైదరాబాద్లో టాటా ఏఐజీ టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటుతో పాటు టీ-హబ్ ఇన్నోవేషన్ ఫండ్కు టాటా క్యాపిటల్తో సహకారం అందించనున్నారని కేటీఆర్ తెలిపారు. డిఫెన్స్, ఏరోస్పేస్ రంగాల్లో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు టాటా గ్రూప్ ఆసక్తిగా ఉందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా కేటీఆర్ పర్యటన కొనసాగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement