చిన్న పరిశ్రమకు ‘పెద్ద’ దెబ్బ

చిన్న పరిశ్రమకు ‘పెద్ద’ దెబ్బ


- పెద్ద నోట్ల రద్దుతో కుదేలు  

- భారీగా తగ్గిపోరుున ఉత్పత్తి

- రోడ్డున పడుతున్న దిన కూలీలు

- స్తబ్దుగా రాజధాని పారిశ్రామికవాడలు

 

 సాక్షి, హైదరాబాద్: క్లాసిక్ టైల్స్. నాచారం పారిశ్రామిక ప్రాంతంలో ఒక చిన్న పరిశ్రమ. కొత్తగా నిర్మించే భవనాలు, అపార్ట్‌మెంట్ల నుంచి ఆర్డర్లపై టైల్స్ ఉత్పత్తి చేస్తుంది. రోజుకు 200 నుంచి 300 మంది కార్మికులు పని చేస్తారు. బ్యాంకు రుణాలందక, ప్రభుత్వ ప్రోత్సాహకాల్లేక అసలే ఆర్థిక ఇబ్బందులుంటే... పెద్ద నోట్ల రద్దు మూలిగే నక్కపై తాటిపండులా మారింది. ఆర్డర్లు సగానికి సగం తగ్గడంతో ఉత్పత్తినీ తగ్గించారు. సంస్థనే నమ్ముకున్న దిన కూలీలు రోడ్డున పడ్డారు. ‘పరిశ్రమను నడపడం చాలా కష్టంగా ఉంది. కూలీలకు డబ్బులివ్వలేకపోతున్నాం’ అన్నది యజమాని వెంకన్న ఆవేదన. హైదరాబాద్ చుట్టూ వేలాదిగా విస్తరించిన కుటీర, చిన్న, మధ్య తరహా పరిశ్రమలదీ ఇదే దుస్థితి. వాటినే నమ్ముకున్న కార్మికులేమో కష్టాల కొలిమిలో మగ్గుతున్నారు!! అన్ని రంగాలదీ ఇదే దుస్థితి

 హైదరాబాద్ చుట్టుపక్కల జీడిమెట్ల, బాలానగర్, కాటేదాన్, బొల్లారం, సనత్‌నగర్, పటాన్‌చెరు, ఉప్పల్, నాచారం, మల్లాపూర్, చర్లపల్లి తదితర ప్రాంతాల్లో 45 వేల దాకా మధ్య తరహా, చిన్న, కుటీర పరిశ్రమలున్నారుు. వీటిలో సుమారు 10 వేల గృహ అనుబంధ వస్తూత్పత్తి పరిశ్రమలున్నారుు. తెలుగు రాష్ట్రాల నుంచేగాక మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా తదితర రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది కార్మికులు వీటిలో సంఘటిత, అసంఘటిత విభాగాల్లో పని చేస్తున్నారు. నగరం చుట్టూ విస్తరించిన రియల్ ఎస్టేట్ రంగం డిమాండ్లకు అనుగుణంగా ఐరన్, స్టీల్, ఫర్నిచర్, టైల్స్, సిమెంట్, పెరుుంట్స్, వెల్డింగ్, కెమికల్స్, ప్లాస్టిక్, టెక్స్‌టైల్స్, ఆహార తదితర పరిశ్రమలన్నీ నోట్ల రద్దు దెబ్బకు కుదేలయ్యారుు. బ్యాంకు రుణాలు, వడ్డీ రేట్లతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఈ పరిశ్రమలను నోట్ల రద్దు గట్టి దెబ్బే కొట్టింది. ‘‘రుణాలపై 12 నుంచి 14 శాతం వడ్డీ, రూ.50 వేల నుంచి లక్ష దాకా కరెంటు చార్జీలు, మౌలిక సదుపాయాలు, ముడి సరుకు, జీతభత్యాలు, రవాణా ఖర్చుల వంటివన్నీ కలిపి ప్రతి చిన్న పరిశ్రమపైనా కోట్లలో భారం పడుతోంది.ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాల్లేవు. సబ్సిడీలూ ఆగిపోయారుు. నోట్ల రద్దు దెబ్బకు ఇప్పుడు ఆర్డర్లూ బాగా తగ్గారుు’ అని నాచారానికి చెందిన పలు పరిశ్రమల యజమానులు వాపోతున్నారు. ఉత్పత్తి తగ్గడంతో, పరిశ్రమల మనుగడకు ప్రాణాధారమైన విద్యుత్ వినియోగమూ తగ్గింది. రాజధానిలోని అన్ని పరిశ్రమలకు రోజుకు సగటున 1,500 మెగావాట్ల హై టెన్షన్ విద్యుత్ వినియోగమయ్యేది 1,200 మెగావాట్లకు పడిపోరుుందని అంచనా. కాటేదాన్‌లో విస్తరాకులు, వెల్డింగ్, ఫర్నిచర్ వంటి 1,000కి కుటీర పరిశ్రమలు ఆర్డర్లు  లేక కుదేలయ్యారుు. వీటిలో పని చేసే బిహార్, మహబూబ్‌నగర్, నల్లగొండ, రంగారెడ్డి తదితర ప్రాంతాల కార్మికులకూ ఉపాధి కరువైంది.

 

 సగానికి తగ్గింది

 ‘‘అన్ని చిన్న తరహా పరిశ్రమల్లోనూ ఉత్పత్తి సగానికి సగం తగ్గింది. వైఎస్ హయాంలో మావంటి పరిశ్రమలకు పావలా వడ్డీ రుణాలు లభించేవి. పెద్ద నోట్ల రద్దుతో ఆర్డర్లు పడిపోరుు పరిస్థితి దారుణంగా మారింది’’    - వెంకన్న, తెలంగాణ చిన్న తరహా పరిశ్రమల సమాఖ్య అధ్యక్షుడు కూలీలూ నష్టపోతున్నారు..

 మాది ప్లాస్టిక్ పరిశ్రమ. రోజూ 10 మంది పని చేస్తారు. ఏ రోజు కూలీ ఆ రోజే ఇవ్వాలి. పెద్ద నోట్లు చెల్లక పని మాన్పించాను. మావంటి కుటీర పరిశ్రమలే గాక వాటిపై బతుకున్న కూలీలూ తీవ్రంగా నష్టపోతున్నారు. 

   - పి.సురేశ్, ఓ కుటీర పరిశ్రమ

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top