మిషన్‌.. పరేషాన్‌..! | Slow down work of Mission Kakatiya | Sakshi
Sakshi News home page

మిషన్‌.. పరేషాన్‌..!

Jan 17 2017 2:34 AM | Updated on Sep 5 2017 1:21 AM

మిషన్‌.. పరేషాన్‌..!

మిషన్‌.. పరేషాన్‌..!

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మిషన్‌ కాకతీయ’ పథకం నత్తనడక నడుస్తోంది.

నత్తనడకన చెరువుల పునరుద్ధరణ పనులు

  • అధికారుల అక్రమాలతో మసకబారుతున్న ‘మిషన్‌ కాకతీయ’ ప్రభ
  • ఇప్పటికే ఐదుగురు సస్పెన్షన్, నలుగురు ఏసీబీ కేసులో
  • తాజాగా టేకులపల్లిలో ఈఈని అరెస్ట్‌ చేసిన సీబీసీఐడీ  

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మిషన్‌ కాకతీయ’ పథకం నత్తనడక నడుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా చెరువుల పునరుద్ధరణ మందకొడిగా సాగుతోంది. రెండేళ్ల కింద ప్రారంభించిన తొలి విడత పనుల్లోనే వెయ్యికి పైగా చెరువుల పనులు ఇంకా సాగుతుండగా... రెండో విడత చేపట్టిన వాటిలో కేవలం పది శాతం చెరువులే పూర్త య్యాయి. ఇక ఇప్పటికే ప్రారంభం కావాల్సిన మూడో విడతకు అతీగతీ కనిపించడం లేదు. పనుల్లో తీవ్ర జాప్యానికి తోడు అధికారుల అక్రమాలతో ‘మిషన్‌ కాకతీయ’ ప్రభ మసక బారుతోంది.

ఇంత మందకొడిగానా: మిషన్‌ కాకతీయ పథకంలో రెండేళ్ల కింద తొలి విడతగా 9,586 చెరువుల పునరుద్ధరణ లక్ష్యంగా పెట్టుకోగా.. అందులో 8,120 చెరువుల పనులను రూ.2,596 కోట్లతో చేపట్టారు. ఇందులోనూ 8,043 చెరువు పనులనే ప్రారంభించగా.. ఇప్పటివరకు 6,939 చెరువులు మాత్రమే పూర్తయ్యాయి. మరో 1,104 చెరువుల పను లు ఇంకా కొనసాగుతున్నాయి. ఇక రెండో విడతలో 10,193 చెరువులను లక్ష్యంగా పెట్టు కోగా... 9,030 చెరువులకు పరిపాలనా అను మతులు మంజూరు చేసి, రూ.1,744 కోట్లతో 8,701 చెరువుల పనులను మొదలు పెట్టారు. వీటిలో ఇప్పటివరకు రూ.272 కోట్ల విలువైన 1,536 పనులు మాత్రమే పూర్తయ్యాయి.

మిగతా 7,165 చెరువుల పనులు సాగుతూనే ఉన్నాయి. వీటి పూర్తికి ఈ ఏడాది మార్చిని తుది గడువుగా విధించినా.. అప్పటికి పూర్త య్యే అవకాశాలు కానరావడం లేదు. చెరు వుల పనులకు సరైన అనుభవం లేని కాంట్రా క్టర్లు ఇష్టారీతిన లెస్‌లకు టెండర్లు దాఖలు చేయడం, పని మొదలు పెట్టాక ఆ ధరలు సర్దుబాటు కాక పనులు చేయకుండా వదిలే యడమే దీనికి కారణంగా తెలుస్తోంది. దీనికి తోడు బిల్లులు పాస్‌ కావాలంటే వివిధ స్థాయి ల్లో అధికారులకు, ప్రజాప్రతినిధులకు కమీష న్లు చెల్లించాల్సి రావడం, ఆ మొత్తాలు తడిసి మోపెడు కావడం సైతం పనులకు అడ్డుపడుతోంది.

భారీగా బిల్లులు పెండింగ్‌..
మిషన్‌ కాకతీయ తొలి విడతకు సంబంధించి రూ.200 కోట్ల మేర బిల్లులు పెండింగ్‌లో ఉండగా.. రెండో విడత కింద రూ.2వేల కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. మూడు నెలలుగా బిల్లుల చెల్లింపు ప్రక్రియ నిలిచిపోవడం, క్వాలిటీ కంట్రోల్‌ సర్టిఫికెట్ల జారీలో జాప్యం, పీఏవోల్లో వస్తున్న ఇబ్బందులతో కాంట్రాక్టర్లు పనులను మధ్యలో నిలిపివేసినట్లుగా నీటిపా రుదల వర్గాల ద్వారా తెలుస్తోంది. మూడో విడత కింద ఇటీవలి వర్షాలకు దెబ్బతిన్న చెరువులు, వర్షాలు సరిగా కురవని మహబూ బ్‌నగర్, నల్లగొండ, ఖమ్మం జిల్లాలోని చెరువులు కలిపి 3వేల చెరువులను పునరు ద్ధరించాలని లక్ష్యంగా నిర్ధారించుకున్నా వాటి అతీగతీ లేదు. జనవరి నాటికే చెరువుల ప్రతిపాదనలు సీఈ కార్యాలయానికి చేరాల్సి ఉన్నా ఆ ప్రక్రియే మొదలు కాలేదు.

అధికారుల అక్రమాలతో..
ఇప్పటికే వేగం తగ్గిన పనులకు తోడు అధికారుల అక్రమాలు మిషన్‌ కాకతీయ ప్రతిష్టను మసకబారుస్తు న్నాయి. ఇప్పటికే కాంట్రాక్టర్ల నుంచి లంచాలు తీసుకుంటూ నలుగురు అధికారులు ఏసీబీకి చిక్కగా... అంచనాల తయారీలో ఇష్టారాజ్యం, చేయని పనిని చేసినట్లుగా చూపడం, తక్కువ పనులను ఎక్కువ చేసి చూపడం వంటి కారణాలతో ఐదుగురు అధికారులపై సస్పెన్షన్‌ వేటు పడింది. మరో 12 మంది అధికారులపై క్రిమినల్‌ చర్యలకు సిఫార్సులు కూడా వచ్చాయి. ఖానాపూర్‌ నియోజకవర్గంలో అవక తవకలపై విజిలెన్స్‌ విచారణ జరుగు తుండగా, సోమవారం సత్తుపల్లి నియో జకవర్గ పరిధిలోని టేకులపల్లి సర్కిల్‌లో జరిగిన అవకతవకలకు బాధ్యుడిని చేస్తూ ఒక ఈఈని అరెస్ట్‌ చేయడం శాఖలో చర్చనీయాంశంగా మారింది. మొత్తంగా మిషన్‌ కాకతీయపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించి తిరిగి పనులను వేగిరం చేయాల్సిన అవసరముంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement