రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు సోమవారం తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావును కలుసుకున్నారు.
రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు సోమవారం తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావును కలుసుకున్నారు. రామోజీ ఫిలిం సిటీలో నిర్మిస్తున్న ఓం సిటీకి సంబంధించిన పుస్తకాన్ని సీఎంకు బహుకరించారు. భేటీ అనంతరం సచివాలయం వెలుపలికి వచ్చిన ఆయన.. విలేకరుల ప్రశ్నలకు స్పందిస్తూ.. 'కేసీఆర్ ను కలవడంలో ప్రాధాన్యం ఏమీలేదు.. ఊరికే కలిశా..' అన్నారు.
గత డిసెంబర్లో రామోజీ ఆహ్వానం మేరకు ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి ఫిలిం సిటీకి వెళ్లిన కేసీఆర్.. దాదాపు ఐదుగంటలపాటు అక్కడే గడిపారు. ఫిలిం సిటీతోపాటు నూతనంగా నిర్మిస్తోన్న ఓం సిటీ విశేషాలను తెలుసుకుని ఓం సిటీకి సంబంధించిన పుస్తకాన్ని బహుమానంగా అందుకున్నారు. సోమవారం నాటి భేటీలోనూ రామోజీరావు.. ఓం సిటీకి సంబంధించిన పుస్తకాన్నే సీఎంకు బహుకరించడం విశేషం!