మరో 24 గంటల్లో తెలుగు రాష్ట్రాలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
విశాఖపట్నం : మరో 24 గంటల్లో తెలుగు రాష్ట్రాలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఛత్తీస్గఢ్ నుంచి కోస్తాంధ్ర మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి ఏర్పడుతోందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు తెలంగాణ నుంచి లక్షద్వీప్ వరకు మరో అల్పపీడన ద్రోణి ఏర్పడే సూచనలున్నాయని చెప్పారు. ఈ రెండు ద్రోణుల ప్రభావంతో రాగల 24 గంట్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు.