కొత్త జిల్లాల ప్రకారమే టీచర్‌ పోస్టులు భర్తీ చేయాలి | R krishnaiah letter to the cm kcr | Sakshi
Sakshi News home page

కొత్త జిల్లాల ప్రకారమే టీచర్‌ పోస్టులు భర్తీ చేయాలి

Aug 15 2017 3:34 AM | Updated on Aug 15 2018 9:37 PM

కొత్త జిల్లాల ప్రకారమే టీచర్‌ పోస్టులు భర్తీ చేయాలి - Sakshi

కొత్త జిల్లాల ప్రకారమే టీచర్‌ పోస్టులు భర్తీ చేయాలి

ఉపాధ్యా య నియామకాలను ఇకపై కొత్త జిల్లాల యూనిట్‌ ప్రకారమే చేపట్టాలని టీడీపీ ఎమ్మెల్యే, బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌ చేశారు.

ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌  
 
సాక్షి, హైదరాబాద్‌: ఉపాధ్యా య నియామకాలను ఇకపై కొత్త జిల్లాల యూనిట్‌ ప్రకారమే చేపట్టాలని టీడీపీ ఎమ్మెల్యే, బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు సోమవారం ఆయన లేఖ రాశారు. విద్యాశాఖ 8,972 పోస్టులు మాత్రమే ఖాళీగా ఉన్నట్లు చెబుతోందని, వాస్తవానికి 40 వేల టీచర్లు అవసరమని సర్వేలు చెబుతున్నాయన్నారు.

ఉపాధ్యాయ ఖాళీలను పూర్తిస్థాయిలో భర్తీ చేయాలని, నియామకాల నోటిఫికేషన్‌ను విడుదల చేయాలని కోరారు. రాష్ట్రం ఏర్పడ్డాక ఉపాధ్యాయ నియామకాలే చేపట్టలేదని, ఉపాధ్యాయ ఖాళీలతో పాటు ప్రభుత్వ శాఖల్లోని ఖాళీ పోస్టులన్నీ యుద్ధ ప్రాతిపదికన భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement