ఖతర్ నుంచి గోవా వెళ్లాల్సిన విమానాన్ని హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది.
ఖతర్ నుంచి గోవా వెళ్లాల్సిన విమానాన్ని హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో గోవా వెళ్లకుండా అప్పటికప్పుడే శంషాబాద్లో దించేయాల్సి వచ్చింది. ఇటీవలి కాలంలో విమానాలలో తరచు సాంకేతిక లోపాలు తలెత్తుతున్నాయి.
మలేషియా నుంచి బెంగళూరు రావాల్సిన ఓ విమానంలో ఇలాగే టైరు పేలిపోవడం, ల్యాండింగ్ గేర్ పనిచేయకపోవడంతో దాన్ని అత్యవసరంగా కౌలాలంపూర్లో ల్యాండింగ్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు గల్ఫ్లోని ఖతార్ నుంచి వస్తున్న విమానం గోవా వెళ్లాల్సి ఉండగా అది హైదరాబాద్లోనే నిలిచిపోయింది.