నెయ్యి కిలో రూ. 10, పంచదార కిలో రూ. 2! | price list of 1971 doing rounds in social media | Sakshi
Sakshi News home page

నెయ్యి కిలో రూ. 10, పంచదార కిలో రూ. 2!

Jun 18 2016 3:30 AM | Updated on Jul 6 2019 3:18 PM

అదంతా 1971 నాటి మాట. ఎవరో ఒక పెద్దాయన అప్పట్లో రాసుకున్న సరుకుల చీటీ ఇటీవల బయటపడింది.

నెయ్యి.. కిలో రూ. 10 (ఇప్పుడు కిలో 400)
పంచదార.. కిలో రూ. 2 (ఇప్పుడు రూ.60)
పెసరపప్పు కిలో రూ. 1.70 (ఇప్పుడు రూ. 145)


అదంతా 1971 నాటి మాట. ఎవరో ఒక పెద్దాయన అప్పట్లో రాసుకున్న సరుకుల చీటీ ఇటీవల బయటపడింది. వాళ్ల వారసులు ఎవరో దాన్ని చూసి ముచ్చటపడి ఫొటోతీసి సోషల్ మీడియాలో పెట్టారు. అది అలా అలా షేర్ అవుతూ పలు వాట్సప్ గ్రూపుల్లోకి చేరింది. ఫేస్‌బుక్‌లో కూడా బాగా ట్రెండ్ అవుతోంది. అప్పటికి, ఇప్పటికి ధరలలో ఎంత వ్యత్యాసం ఉందంటూ అందరూ నోళ్లు నొక్కుకుంటున్నారు. అసలే పచ్చిమిర్చి కిలో 100-120 చొప్పున పలుకుతుండటం, టమోటా ధర కూడా భగ్గుమనడంతో ప్రతిరోజూ వంట ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితిలో గృహిణులు ఉంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆనాటి ధరల వివరాలు తెలియడంతో ఒక్కసారిగా మళ్లీ ఆరోజుల్లోకి వెళ్లిపోతే ఎంత బాగుంటుందని అనుకున్నారు.సుమారు 45 ఏళ్లనాడు కిరాణా పట్టీ విలువ రూ.44.75 (1971లో)
కానీ.. ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోవాలి. అప్పట్లో జీతాలు కూడా వందల్లోనే ఉండేవి. కేంద్ర ప్రభుత్వోద్యోగులకు కూడా అప్పటికి 250 నుంచి 350 రూపాయల వరకు మాత్రమే వచ్చేది. అందులోంచి ఇంటి అద్దె, పిల్లల చదువులు, సరుకులు అన్నింటికీ సర్దుకోవాలి. దానికితోడు అప్పట్లో ప్రతి కుటుంబంలో కనీసం ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉండేవారు. పండగలొస్తే అందరికీ కొత్తబట్టలు కూడా తప్పవు. అయితే.. ద్రవ్యోల్బణం మరీ అంత ఎక్కువ ఉండకపోవడంతో పాటు వినోదం, విలాసాలకు పెట్టే ఖర్చులు కూడా అంతంతమాత్రంగానే ఉండటంతో అన్నింటికీ ఎంచక్కా సరిపోయేది.ప్రస్తుతం అవే కిరాణా సరుకులు కొంటే అయ్యే మొత్తం రూ. 1793(2016లో)

Advertisement
 
Advertisement
Advertisement