హైదరాబాద్ నగర శివారుల్లో అనుమతులు లేకుండా వీకెండ్ పార్టీలు నిర్వహిస్తున్న వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు.
హైదరాబాద్: హైదరాబాద్ నగర శివారుల్లో అనుమతులు లేకుండా వీకెండ్ పార్టీలు నిర్వహిస్తున్న వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. అందులోభాగంగా మహబూబ్నగర్ జిల్లా షాద్నగర్ మండలం శేరిగూడ అగ్రిగోల్డ్ వెంచర్పై శనివారం అర్థరాత్రి పోలీసులు దాడి చేశారు. మేనేజర్ను అరెస్ట్ చేశారు. దాదాపు 200కు పైగా మద్యం బాటిళ్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అగ్రిగోల్డ్ సంస్థపై పోలీసులు కేసు నమోదు చేశారు.