రైతుల దుస్థితికి గత పాలకులే కారణం: పాతూరి | Paturi Sudhakar Reddy about kcr | Sakshi
Sakshi News home page

రైతుల దుస్థితికి గత పాలకులే కారణం: పాతూరి

Aug 6 2017 2:03 AM | Updated on Jun 4 2019 5:04 PM

రైతుల దుస్థితికి గత పాలకులే కారణం: పాతూరి - Sakshi

రైతుల దుస్థితికి గత పాలకులే కారణం: పాతూరి

వ్యవసాయ రంగంలో తెలంగాణను అగ్ర భాగాన నిలబెట్టడం కోసం సీఎం కేసీఆర్‌ అహర్నిశలు శ్రమిస్తున్నారని శాసనమండలి చీఫ్‌విప్‌ పాతూరి సుధాకర్‌రెడ్డి అన్నారు.

సాక్షి,హైదరాబాద్‌: వ్యవసాయ రంగంలో తెలంగాణను అగ్ర భాగాన నిలబెట్టడం కోసం సీఎం కేసీఆర్‌ అహర్నిశలు శ్రమిస్తున్నారని శాసనమండలి చీఫ్‌విప్‌ పాతూరి సుధాకర్‌రెడ్డి అన్నారు. కేసీఆర్‌ రైతు సంక్షేమం కోసం తీసు కుంటున్న చర్యల ఫలితాలు ఇప్పటికే కనిపి స్తున్నాయన్నారు.

వచ్చే ఏడాది నుంచి పెట్టుబడి పథకం కింద ఎకరాకు రూ.8 వేల పంపిణీ వ్యవసాయ రంగంలో సరికొత్త శకానికి నాంది పలకబోతోందన్నారు. ప్రస్తుతం రైతుల దుస్థితికి గత పాలకులు వ్యవసాయ రంగం మీద చూపిన నిర్లక్ష్యమే కారణమన్నారు. సెప్టెంబర్‌ 1,2 తేదీల్లో కడపలో జరిగే పీపుల్స్‌ పార్లమెంట్‌ బ్రోచర్‌ను పాతూరి శాసనమండలిలోని ఆయన కార్యాల యంలో ఆవిష్కరించారు. పీపుల్‌ ఎగైనెస్ట్‌ కరప్షన్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సదస్సుకు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధుల ను ఆహ్వానించడం శుభపరిణామమన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement