రైతుల పేరిట నీచ రాజకీయాలు | paturi sudakar reddy fired on congress leaders | Sakshi
Sakshi News home page

రైతుల పేరిట నీచ రాజకీయాలు

Oct 22 2016 2:07 AM | Updated on Mar 18 2019 9:02 PM

రాష్ట్రంలో రైతులు సంతోషంగా ఉన్న సమయంలో కాంగ్రెస్ నాయకులు గర్జనల పేరిట నీచ రాజకీయాలు చేస్తున్నారని శాసన మండలి చీఫ్ విప్ పాతూరి సుధాకర్‌రెడ్డి విమర్శించారు.

కాంగ్రెస్‌పై పాతూరి ధ్వజం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రైతులు సంతోషంగా ఉన్న సమయంలో కాంగ్రెస్ నాయకులు గర్జనల పేరిట నీచ రాజకీయాలు చేస్తున్నారని శాసన మండలి చీఫ్ విప్ పాతూరి సుధాకర్‌రెడ్డి విమర్శించారు. మహబూబాబాద్ రైతు గర్జన సభలో పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత జానారెడ్డి.. ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావుపై అనవసర విమర్శలు చేశారని మండిపడ్డారు.

శుక్రవారం ఆయన టీఆర్‌ఎస్ ఎల్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ, రుణమాఫీతో రైతులు సంతోషంగా ఉంటే  కాంగ్రెస్ నేతలేమో అక్కసుతో నిరసనలకు దిగుతున్నారని ధ్వజమెత్తారు. ఉమ్మడి రాష్ట్రాన్ని పాలించిన గత పాలకుల పక్షపాత ధోరణి వల్లే కృష్ణా ట్రిబ్యునల్‌లో తెలంగాణకు అన్యాయం జరుగుతోందన్నారు. రాష్ట్రంలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న టీచర్ల సమస్యలను పరిష్కరించడానికి సీఎం కేసీఆర్ సుముఖత వ్యక్తం చేశారని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement