నగరంలోని మియాపూర్ ప్రాంతంలో ధనంజయ ట్రావెల్స్‌కు చెందిన బస్సును ప్రయాణికులు గురువారం రాత్రి అడ్డుకున్నారు.
హైదరాబాద్: నగరంలోని మియాపూర్ ప్రాంతంలో ధనంజయ ట్రావెల్స్‌కు చెందిన బస్సును ప్రయాణికులు గురువారం రాత్రి అడ్డుకున్నారు. ఒక్కో టిక్కెట్టును నలుగురికి అమ్ముకోవడమే కాకుండా వోల్వో బస్సుకు టికెట్ బుక్ చేసుకుంటే సూపర్ లగ్జరీ బస్సులో టికెట్ కేటాయించారు. కనీసం సూపర్ లగ్జరీ బస్సులు కూడా ఏర్పాటు చేయకుండా జాప్యం ప్రదర్శిస్తూ సరైన సమాధానం చెప్పడంలేదని ప్రయాణికులు వాపోతున్నారు.