ఆస్కీ నూతన చైర్మన్‌గా పద్మనాభయ్య | padmanabaiah IAS appointed as ASCI | Sakshi
Sakshi News home page

ఆస్కీ నూతన చైర్మన్‌గా పద్మనాభయ్య

Nov 26 2015 3:22 AM | Updated on Sep 3 2017 1:01 PM

ప్రఖ్యాత అడ్మినిస్ట్రేటివ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఆస్కీ) నూతన చైర్మన్‌గా పద్మభూషణ్ అవార్డు గ్రహీత కె.పద్మనాభయ్య నియామకం అయ్యారు.

హైదరాబాద్: ప్రఖ్యాత అడ్మినిస్ట్రేటివ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఆస్కీ) నూతన చైర్మన్‌గా పద్మభూషణ్ అవార్డు గ్రహీత కె.పద్మనాభయ్య నియామకం అయ్యారు. ఆయన ఐఏఎస్ 1961 బ్యాచ్‌కు చెందిన అధికారి. కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా కూడా పనిచేశారు. ఈ సందర్భంగా పద్మనాభయ్య మాట్లాడుతూ.. ‘1956లో స్థాపించినప్పటి నుంచీ ఐఐఎంలు, ఇతర బిజినెస్ స్కూళ్లు వచ్చే వరకు ఆస్కీ దేశంలోనే టాప్ సంస్థగా ఉంది. ఆస్కీకి తిరిగి పునర్వైభవాన్ని తీసుకొచ్చేందుకు కృషి చేస్తా..’’ అని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement