అసదుద్దీన్ ఓవైసీ దిష్టిబొమ్మ దహనం | ovaisi effigy burning | Sakshi
Sakshi News home page

అసదుద్దీన్ ఓవైసీ దిష్టిబొమ్మ దహనం

Jul 10 2016 6:13 PM | Updated on Sep 4 2018 5:21 PM

ఎన్‌ఐఏ అధికారులు అరెస్ట్ చేసిన ఉగ్రవాద నిందితులకు న్యాయ సాయం చేస్తామంటూ మాట్లాడిన అసదుద్దీన్ ఓవైసీని వెంటనే ఎంపీ పదవి నుంచి బర్తరఫ్ చేయాలని బీజేపీ సరూర్‌నగర్ మండలాధ్యక్షుడు మద్ది రాజశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు.

ఎన్‌ఐఏ అధికారులు అరెస్ట్ చేసిన ఉగ్రవాద నిందితులకు న్యాయ సాయం చేస్తామంటూ మాట్లాడిన అసదుద్దీన్ ఓవైసీని వెంటనే ఎంపీ పదవి నుంచి బర్తరఫ్ చేయాలని బీజేపీ సరూర్‌నగర్ మండలాధ్యక్షుడు మద్ది రాజశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు బీజేపీ నాయకులు మామిడిపల్లిలో ఆదివారం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ దిష్టిబొమ్మను దహనం చేశారు.

 

ఈ సందర్భంగా రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.....దేశ వ్యతిరేక కార్యాకలాపాలను అవలంభిస్తున్న మజ్లీస్ పార్టీ గుర్తింపును వెంటనే రద్దు చేయాలన్నారు. అమాయక ప్రజల ప్రాణాలను బలితీసుకుంటున్న ఉగ్రవాదులను ఉపేక్షించేలా మాట్లాడడం సిగ్గుచేటన్నారు. హైదరాబాద్‌లో మారణ హోమం సృష్టించాలనుకున్న ఉగ్రవాదులకు న్యాయ సాయం చేస్తామంటూ అసదుద్దీన్ వ్యాఖ్యానించడం సహించరాని విషయమన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు విజేందర్ రెడ్డి, పద్మారావు, రంగనాథ్, వెంకటేష్, కష్ణ, మల్లేష్, సుమన్ తదితరులు పాల్గొన్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement