'గ్రేటర్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయండి' | our goal is to win in grater elections, ponnala address to congress activists | Sakshi
Sakshi News home page

'గ్రేటర్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయండి'

Jun 21 2015 7:39 PM | Updated on Mar 18 2019 7:55 PM

రానున్న గ్రేటర్ ఎన్నికలలో కలసి కట్టుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీ గెలుపునకు నాయకులు, కార్యకర్తలు కృషిచేయాలని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య పిలుపునిచ్చారు.

హబ్సిగూడ (హైదరాబాద్): రానున్న గ్రేటర్ ఎన్నికలలో కలసి కట్టుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీ గెలుపునకు నాయకులు, కార్యకర్తలు కృషిచేయాలని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య పిలుపునిచ్చారు. ఆదివారం హబ్సీగూడాలో ఏర్పాటుచేసిన ఉప్పల్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

జీహెచ్ఎంసీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఆ మేరకు పార్టీ కార్యకర్తలను కార్యోన్ముఖుల్ని చేసేందుకు ఉప్పల్ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లుగా వ్యవహరిస్తున్న పొన్నాల లక్ష్మయ్య, మాజీ మంత్రి ఎమ్మెల్యే డి.కే.అరుణ, ఎమ్మెల్సీ ఆకుల లలిత ఈ సమావేశంలో పాలుపంచుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పూటకొక మాట మాట్లాడుతూ ఆచరణ సాధ్యం కాని హామీలతో ప్రజలను మోసగిస్తున్నారని పొన్నాల విమర్శించారు. మాజీ మంత్రి డికే.ఆరుణ మాట్లాడుతూ.. కేసీఆర్ కుటుంబ పాలన సాగిస్తున్నారని ఆయనకు ప్రజా సంక్షేమం పట్టడం లేదని ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement