ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా వేసవి సెలవుల్లో తరగతులు నిర్వహిస్తున్న ప్రైవేట్ కళాశాలలకు అధికారులు నోటీసులు జారీ చేశారు.
సాక్షి,సిటీబ్యూరో: ప్రభుత్వ నిబంధనలకు వ్యతి రేకంగా వేసవి సెలవుల్లో తరగతులు నిర్వహిస్తున్న ప్రైవేట్ కళాశాలలకు అధికారులు నోటీసులు జారీ చేశారు. హైదరాబాద్ జిల్లాలో ఐదు టాస్క్ ఫోర్స్ బృందాలు 12,13 తేదీల్లో దాడు లు నిర్వహించారు. సెలవుల్లో తరగతులు నిర్వహిస్తున్న 37 కళాశాలల్లో తనిఖీలు నిర్వహించి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందుకున్న జాబితాలో పలు ప్రముఖ కళాశాలలు ఉన్నాయి.
మెహిదీపట్నం తార్నాక, సంతోష్‌నగర్, న్యూనల్లకుంట, నల్లకుంటలోని నారాయణ జూనియర్ కళాశాలలు, డీడీ కాలనీ,ఎస్‌ఆర్‌నగర్, సైదాబాద్‌ల్లోని శ్రీచైతన్య, బర్కత్‌పురా,చార్మినార్‌లలోని గాయత్రీ, లక్డీకాపూల్‌లో తపస్వీ, మలక్‌పేట్‌లో ఎంఎస్, సైదాబాద్‌లో శ్రీనివాస, హిమాయత్‌నగర్‌లో గురు, సంతోష్‌నగర్‌లో గౌతమి, ఎస్‌ఆర్‌నగర్‌లో సీఎంఎస్ థామస్ జూనియర్ కళాశాలలకు నోటీసులు జారీచేసినట్టు అధికార వర్గాలు తెలిపాయి.