కేసీఆర్ను కలిసేందుకు సినీ ప్రముఖుల క్యూ | nandamuri harikrishna, kalyan ram, satyanarayana meets kcr | Sakshi
Sakshi News home page

కేసీఆర్ను కలిసేందుకు సినీ ప్రముఖుల క్యూ

May 22 2014 12:01 PM | Updated on Aug 15 2018 9:20 PM

టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ను కలిసేందుకు తెలుగు చిత్రపరిశ్రమ ప్రముఖులు క్యూ కడుతున్నారు.

హైదరాబాద్ : టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ను కలిసేందుకు తెలుగు చిత్రపరిశ్రమ ప్రముఖులు క్యూ కడుతున్నారు. తాజాగా ఆయనను టీడీపీ మాజీ ఎంపీ, సినీనటుడు నందమూరి హరికృష్ణ, ఆయన కుమారుడు కల్యాణ్ రామ్, సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ గురువారం కలిశారు. ఈ సందర్భంగా వారు తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ  కాబోయే ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

కాగా  సినీనటుడు మోహన్ బాబు నిన్న కేసీఆర్ను కలిశారు. ప్రత్యేక తెలంగాణను సాధించినందుకు కేసీఆర్ మోహన్ బాబు అభినందనలు తెలిపిన విషయం తెలిసిందే. అలాగే మురళీ మోహన్, ఆర్ నారాయణ మూర్తి,  రామానాయుడు, సురేష్ బాబు, అలీ, వేణుమాధవ్, అశోక్ కుమార్, శివకృష్ణ, కేఎస్ రామారావు తదితరులు ఉన్నారు.


 

Advertisement
 
Advertisement
Advertisement