మొదటి భార్యకు అడ్డంగా దొరికిపోయాడు.. | man catched in temple with his first wife in hyderabad | Sakshi
Sakshi News home page

మొదటి భార్యకు అడ్డంగా దొరికిపోయాడు..

Mar 2 2016 11:23 AM | Updated on Mar 23 2019 9:28 PM

మొదటి భార్యకు అడ్డంగా దొరికిపోయాడు.. - Sakshi

మొదటి భార్యకు అడ్డంగా దొరికిపోయాడు..

ఇద్దరు మహిళలను పెళ్లాడి...ఒకరికి తెలియకుండా మరొకరిని మెనస్ చేయడానికి తంటాలు పడుతున్న భర్త కష్టాలను సినిమాలోనే చూస్తుంటాం.

హైదరాబాద్: రెండు పెళ్లిళ్లు చేసుకుని ...ఇద్దరు భార్యలతో  ఎలా తంటాలు పడేది,ఒకరికి తెలియకుండా మరొకరిని మెయింటైన్ చేయడానికి హీరో పడే కష్టాలను చాలా సినిమాల్లో చూసి ఉంటాం. అయితే నిజ జీవితంలో కూడా ఓ ప్రబుద్ధుడు ఇద్దరు మహిళలను వివాహం చేసుకొని అడ్డంగా దొరికిపోయిన ఘటన హైదరాబాద్లో చోటుచేసుకుంది. ఇందుకు జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయం వేదికైంది.

వివరాల్లోకి వెళితే తూర్పు గోదావరి జిల్లాకు చెందిన కల్యాణ్(28)కు అదే ప్రాంతానికి చెందిన దుర్గాదేవితో 2010లో వివాహం చేసుకున్నాడు. వీరికి ఓ కుమారుడు కూడా ఉన్నాడు. అనంతరం భార్యాభర్తలు బతుకుదెరువు కోసం హైదరాబాద్ వచ్చారు. కొంతకాలం బాగానే సాగిన వీరి కాపురంలో అనూహ్యంగా 2014లో కల్యాణ్ కనిపించకుండా పోయాడు. దీంతో దుర్గాదేవి భర్త కోసం గాలిస్తూ మాదాపూర్లో నివాసముంటోంది.

2014లో హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్లిన కల్యాణ్ అక్కడ అపర్ణ అనే యువతిని ప్రేమించి రెండో వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత రెండవ భార్యతో హైదరాబాద్ చేరుకుని బోరబండలో నివాసముంటున్నాడు. వీరికి ఓ కుమారుడు జన్మించాడు.  

మొదటి భార్య దుర్గాదేవి మంగళవారం జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయానికి వచ్చింది. అదే సమయంలో కల్యాణ్ తన రెండో భార్యతో కలసి అక్కడకు వచ్చాడు. మరో మహిళ, బిడ్డతో వచ్చిన కల్యాణ్ను దుర్గాదేవి నిలదీసింది. దీంతో కల్యాణ్ రెండో వివాహం చేసుకున్నట్లు ఒప్పుకున్నాడు. దుర్గాదేవి భర్తను చితక్కొట్టి... పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కల్యాణ్పై కేసు నమోదు చేసుకుని స్టేషన్కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement