నేను ఎవర్నీ విమర్శించను: కేసీఆర్ | kcr comments on Power point presentation | Sakshi
Sakshi News home page

నేను ఎవర్నీ విమర్శించను: కేసీఆర్

Mar 31 2016 8:26 PM | Updated on Aug 15 2018 9:30 PM

తాను ఎవర్నీ విమర్శించనని, ప్రజలకు వాస్తవాలు వివరించాలనే పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చానని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు తెలిపారు.

హైదరాబాద్ : తాను ఎవర్నీ విమర్శించనని, ప్రజలకు వాస్తవాలు వివరించాలనే పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చానని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు తెలిపారు. ఆయన గురువారమిక్కడ మాట్లాడుతూ ప్రధాన ప్రతిపక్షం సభ నుంచి పారిపోయిందని అన్నారు. పక్క రాష్ట్రాలతో కూడా సత్సంబంధాలు ఉంటాయని కేసీఆర్ తెలిపారు. 

 

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పక్కపక్క రాష్ట్రాలని వీడిదీస్తే విడిపోవని అన్నారు. రైతు ఎక్కడైనా రైతేనని, వాళ్లు పొట్ట కొట్టమని కేసీఆర్ వ్యాఖ్యానించారు. పవర్ పాయింట్ ప్రజంటేషన్ వివరాల పెన్ డ్రైవ్ ను ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు పంపుతామని ఆయన తెలిపారు. చిల్లర పంచాయితీలు వద్దని కేసీఆర్ సూచించారు. కాగా  ముఖ్యమంత్రి కేసీఆర్  తెలంగాణలో ప్రాజెక్టులపై గురువారం అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement