
ఆ ప్రకటనలతో మాకు సంబంధంలేదు: జనసేన
జనసేన పార్టీ ప్రతినిధుల పేరుతో వస్తున్న ప్రకటనలతో తమకు సంబంధంలేదని, పార్టీకి సంబంధించినవి కావని ఆ పార్టీ ఓ ప్రకటనలో పేర్కొంది.
హైదరాబాద్: జనసేన పార్టీ ప్రతినిధుల పేరుతో వస్తున్న ప్రకటనలతో తమకు సంబంధంలేదని, పార్టీకి సంబంధించినవి కావని ఆ పార్టీ ఓ ప్రకటనలో పేర్కొంది. జనసేన అభిమానులో, పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అభిమానులో ఈ ప్రకటనలు చేస్తున్నారని స్పష్టం చేసింది. ఆదివారం జనసేన పార్టీ కార్యాలయం మీడియాకు ఓ లేఖను విడుదల చేసింది.
జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణం పూర్తిగా రూపుదిద్దుకోనందున అధికార ప్రతినిధులుగా జిల్లాల్లో కానీ, ఇతర ప్రాంతాల్లో కానీ ఇంకా ఎవరినీ నియమించలేదని స్పష్టం చేసింది. జనసేన ప్రతినిధుల పేరుతో మీడియాలో వచ్చిన ప్రకటనలు పార్టీ అభిప్రాయాలు కావని వెల్లడించింది.