నెట్ సెంటర్ పై దాడి, నీలి చిత్రాలు సీడీలు స్వాధీనం | Sakshi
Sakshi News home page

నెట్ సెంటర్ పై దాడి, నీలి చిత్రాలు సీడీలు స్వాధీనం

Published Tue, May 6 2014 8:22 AM

internet cafe owner arrested while purchasing blue film CDs

హైదరాబాద్ : ఇంటర్నెట్ నుంచి నీలి చిత్రాలు డౌన్లోడ్ చేసి...వాటిని మెమరీ కార్డుల్లోకి ఎక్కించి సొమ్ము చేసుకుంటున్న ఓ ఇంటర్నెట్ సెంటర్ నిర్వహకుడిని పశ్చిమ మండల టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి కంప్యూటర్తో పాటు మెమరీ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ఫోర్స్ డీసీపీ కోటిరెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం... టప్పాచబుత్రకు చెందిన మహ్మద్ సర్దార్ స్థానికంగా 'యూనివర్సల్ ఇంటర్నెట్' సెంటర్ను నిర్వహిస్తున్నాడు.

సెంటర్లో ఉన్న కంప్యూటర్లో నీలి చిత్రాలను డౌన్లోడ్ చేసుకుని వినియోగదారుల మెమరీ కార్డులలో డౌన్లోడ్ చేస్తూ డబ్బు సంపాదిస్తున్నాడు. విషయం తెలసుకున్న పోలీసులు నిన్న మధ్యాహ్నం ఇంటర్నెట్ సెంటర్పై దాడి చేశారు. నీలి చిత్రాలను స్వాధీనం చేసుకుని సర్దార్ను అదుపులోకి తీసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం నిందితుడిని టప్పాచబుత్ర పోలీసులకు అప్పగించారు.

 

Advertisement

తప్పక చదవండి

Advertisement