వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవం | Independence day celebrations at ysrcp office | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవం

Aug 16 2015 3:07 AM | Updated on Jul 25 2018 4:07 PM

వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవం - Sakshi

వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవం

వైఎస్ఆర్ సీపీ కార్యాలయంలో ఘనంగా 69వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించారు.

జాతీయజెండాను ఆవిష్కరించిన  వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో 69వ స్వాతంత్య్రదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వందలాది మంది కార్యకర్తలు, నేతల మధ్య పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జాతీయ నేతలకు నివాళులర్పించారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ తెలంగాణ విభాగం అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పార్టీ పార్లమెంటరీ నాయకుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డిలతో పాటు నేతలు వైవీ సుబ్బారెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, విజయసాయి రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, సుజయ్‌కృష్ణ రంగారావు, బొత్స సత్యనారాయణ, అనంత వెంకటరామిరెడ్డి, విశ్వరూప్, నల్లా సూర్యప్రకాశ్, రహమాన్, వాసిరెడ్డి పద్మ, పుత్తా ప్రతాప్‌రెడ్డి, చల్లా మధు, పీఎన్‌వీ ప్రసాద్, కె.శివకుమార్, ప్రసాదరాజు, సామినేని ఉదయభాను, వల్లభనేని బాలశౌరి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement