breaking news
lotuspand
-
వైఎస్ఆర్ సీపీ జిల్లా పరిశీలకుల సమావేశం
హైదరాబాద్ : నగరంలోని లోటస్ పాండ్ లోని వైఎస్ఆర్ సీపీ కార్యాలయంలో జిల్లా పరిశీలకుల సమావేశం మంగళవారం ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశంపై ఈ 29న రాష్ట్ర బంద్ కు వైఎస్ఆర్ సీపీ పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేందుకు చర్చ జరుగుతుంది. ప్రత్యేక హోదా కోసం పార్టీ చేపట్టనున్న బంద్ కు నేతలు, కార్యకర్తలు మద్ధతుగా నిలవాలని పిలుపునిచ్చారు. -
వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవం
జాతీయజెండాను ఆవిష్కరించిన వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో 69వ స్వాతంత్య్రదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వందలాది మంది కార్యకర్తలు, నేతల మధ్య పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జాతీయ నేతలకు నివాళులర్పించారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ తెలంగాణ విభాగం అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పార్టీ పార్లమెంటరీ నాయకుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డిలతో పాటు నేతలు వైవీ సుబ్బారెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, విజయసాయి రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, సుజయ్‌కృష్ణ రంగారావు, బొత్స సత్యనారాయణ, అనంత వెంకటరామిరెడ్డి, విశ్వరూప్, నల్లా సూర్యప్రకాశ్, రహమాన్, వాసిరెడ్డి పద్మ, పుత్తా ప్రతాప్‌రెడ్డి, చల్లా మధు, పీఎన్వీ ప్రసాద్, కె.శివకుమార్, ప్రసాదరాజు, సామినేని ఉదయభాను, వల్లభనేని బాలశౌరి తదితరులు పాల్గొన్నారు. -
జాతీయ జెండా ఆవిష్కరించిన వైఎస్ జగన్