శివాజీ విగ్రహానికి చెప్పుల దండ | Hindu communities protest at uppal | Sakshi
Sakshi News home page

శివాజీ విగ్రహానికి చెప్పుల దండ

Aug 9 2017 1:34 PM | Updated on Sep 11 2017 11:41 PM

ఉప్పల్ పీఎస్ పరిధిలోని రామంతాపూర్లో గత అర్ధరాత్రి ఉద్రిక్తత చోటుచేసుకుంది.

హైదరాబాద్ : ఉప్పల్ పీఎస్ పరిధిలోని రామంతాపూర్లో గత అర్ధరాత్రి ఉద్రిక్తత చోటుచేసుకుంది. రామంతాపూర్ మెయిన్ రోడ్డులో ఉన్న ఛత్రపతి శివాజీ విగ్రహానికి గుర్తుతెలియని వ్యక్తులు చెప్పుల దండ వేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న హిందూ సంఘాల నాయకులు  నిందితులను కఠినంగా శిక్షించాలని ఆందోళనకు దిగారు.
 
శివాజీ విగ్రహానికి జరిగిన అవమానం హిందువుల మనోభావాలు కించపరిచే విధంగా ఉన్నాయని యం.ఎల్.ఎ రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కుట్రకు పాల్పడిన వ్యక్తులను గుర్తించి కఠినంగా శిక్షించాలని ఆయన పోలీసులను డిమాండ్ చేశారు. ఘటన జరిగిన ప్రాంతంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజీపీ నాయకులు, కార్యకర్తలు, హిందూ వాహిని కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement