అగ్రి వర్సిటీలో మరోసారి లాఠీచార్జి | High Tension Privilege at Rajendra Nagar Agricultural University | Sakshi
Sakshi News home page

అగ్రి వర్సిటీలో మరోసారి లాఠీచార్జి

Apr 21 2016 12:36 PM | Updated on Jun 4 2019 5:16 PM

రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విద్యాలయంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

హైదరాబాద్: రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విద్యాలయంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. నాలుగు రోజుల క్రితం మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డిని పశువైద్య విద్యార్థులు దిగ్బంధించటంతో పోలీసులు లాఠీచార్జి చేసిన విషయం విదితమే. అయితే, ఈ సారి విద్యార్థులు మరో సమస్యపై ఆందోళనకు దిగారు. న్యూట్రిషన్ సైన్స్ కోర్సును విశ్వవిద్యాలయం ఎత్తివేయటంపై గురువారం మధ్యాహ్నం యూనివర్సిటీలో నిరసనకు దిగారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి చేశారు. కొందరిని అదుపులోకి తీసుకోవటంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
 

Advertisement
 
Advertisement
Advertisement