చంద్రబాబుది హైటెక్‌ అహంకారం | High-tech Arrogance of chandrababu | Sakshi
Sakshi News home page

చంద్రబాబుది హైటెక్‌ అహంకారం

Dec 22 2016 12:57 AM | Updated on Aug 10 2018 9:46 PM

వ్యవసాయ పరిస్థితులపై బుధవారం శాసనసభలో జరిగిన చర్చ సందర్భంగా టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయ కత్వంలోని పాలనపై మండిపడ్డారు.

టీడీపీపై టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి ధ్వజం

- అన్ని పాపాలు చేసి.. ఇప్పుడు నీతులు మాట్లాడుతారా అని ప్రశ్న
- రైతులకు వైఎస్సార్‌ హయాంలోనే మేలు జరిగిందని వ్యాఖ్య


సాక్షి, హైదరాబాద్‌: వ్యవసాయ పరిస్థితులపై బుధవారం శాసనసభలో జరిగిన చర్చ సందర్భంగా టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయ కత్వంలోని పాలనపై మండిపడ్డారు. తొమ్మి దేళ్లు పాలించిన బాబు హైటెక్‌ అహంకారంతో వ్యవహరించి, వ్యవసాయమే దండగ అన్నా రని గుర్తుచేశారు. విద్యుత్‌ చార్జీలు తగ్గించాలని కోరిన రైతులను పిట్టల్ని కాల్చినట్టు కాల్చి చంపారని పేర్కొన్నారు. విద్యుత్‌ బకాయిల వసూలు కోసం రైతుల మోటార్ల సార్టర్లు లాక్కెళ్లారని.. తీవ్రవాదులకు వేసినట్టు సంకెళ్లు వేసి జైల్లో పెట్టారని చెప్పారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత కూడా రాష్ట్రానికి రావాల్సిన విద్యుత్‌ రాకుండా చంద్రబాబు అడ్డుకుం టుంటే.. తెలంగాణ టీడీపీ నేతలు ఆయన తాబేదారుల్లా వ్యవహరించారే తప్ప ఒక్కరోజు కూడా నోరు మెదపలేదని విమర్శించారు. అలాంటి పాపాలు చేసిన వారు ఇప్పుడు దెయ్యాలు వేదాలు వల్లించినట్టు నీతులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రైతులకు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలోనే మేలు జరిగిందని చెప్పారు. ఆ తర్వాత మళ్లీ  కేసీఆర్‌ నాయ కత్వంలో మంచి జరుగుతోందన్నారు.

చంద్రబాబును అభినందించాలా?
 టీడీపీ సభ్యుడు రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. తొలుత టీఆర్‌ఎస్‌ ఎన్నికల మేనిఫెస్టోను చదివేందుకు రేవంత్‌ ప్రయత్నించిన తరుణంలోనే హరీశ్‌ అడ్డుకు న్నారు.  రేవంత్‌ మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన సమయంలో ఆస్తులు, అప్పులను 42:58 నిష్పత్తిలో తెలంగాణ, ఏపీలకు పంచినా.. విద్యుత్‌ను మాత్రం వినియోగం లెక్కన 56 శాతం తెలంగాణకు ఇచ్చారన్నారు. ఈ విష యంలో అప్పటి కాంగ్రెస్‌ను, సీఎం కిరణ్‌ను, ఇప్పుడు ఏపీ సీఎంగా ఉన్న చంద్ర బాబును అభినందించాలని వ్యాఖ్యానించారు.  రేవంత్‌ తెలంగాణ సభలో ఉండి కూడా ఏపీ సభలో మాట్లాడాల్సిన మాటలు మాట్లాడుతున్నారని హరీశ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement