అక్రమ భవనాలు, లే అవుట్ల క్రమబద్ధీకరణ కోసం ఏర్పాటు చేసిన ఎల్‌ఆర్‌ఎస్, బీఆర్‌ఎస్ పథకాలపై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది.
హైదరాబాద్: అక్రమ భవనాలు, లే అవుట్ల క్రమబద్ధీకరణ కోసం ఏర్పాటు చేసిన ఎల్‌ఆర్‌ఎస్, బీఆర్‌ఎస్ పథకాలపై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. దీనిపై ఆర్డినెన్స్ తీసుకొచ్చామని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. అయితే, ఈ ఆర్డినెన్స్ను సవాలు చేయడానికి అనుమతినివ్వాలని ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ హైకోర్టును కోరింది. అక్రమకట్టడాలను ఇలా క్రమబద్ధీకరించుకుంటూ వెళ్తే భవిష్యత్తు ఏంటి అని ఈ సందర్భంగా కోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. తదుపరి విచారణను కోర్టు బుధవారానికి వాయిదా వేసింది.