మూడో రోజుకు చేరుకున్న ఆమరణ నిరాహార దీక్ష | Sakshi
Sakshi News home page

మూడో రోజుకు చేరుకున్న ఆమరణ నిరాహార దీక్ష

Published Fri, Jan 22 2016 10:36 AM

HCU students indefinite hunger strike comes to third day over rohith suicide

సాక్షి, హైదరాబాద్: దళిత విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని, కేంద్ర మంత్రులు దత్తాత్రేయ, స్మృతీ ఇరానీలు తమ పదవుల నుంచి వైదొలగాలని డిమాండ్ చేస్తూ సెంట్రల్ యూనివర్సిటీలో ఎనిమిది మంది రీసెర్చ్ స్కాలర్స్ చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష శుక్రవారం మూడో రోజుకు చేరింది. తమకు న్యాయం జరిగే వరకు దీక్షను విరమించబోమని వారు స్పష్టం చేశారు. అంబేద్కర్ స్టూడెంట్ అసోసియేషన్, ఎన్‌ఎస్‌యూఐ, డీఎస్‌యూ, బీఎస్‌ఎఫ్ తదితర విద్యార్ధి సంఘాలకు చెందిన విద్యార్థులు గుమ్మడి ప్రభాకర్, ఉమామహేశ్వర్, వైఖరి, జయారావు, మనోజన్, కృష్ణయ్య, జైలావ్, రమేశ్ ఈ దీక్షకు దిగారు.

జేడీయూ బృందం ఈ రోజు హెసీయూకు చేరుకొని దీక్ష చేస్తున్న విద్యార్థులకు తమ సంఘీభావం తెలుపనున్నారు. దీక్ష చేస్తున్న విద్యార్థుల బీపీ, షుగర్ లెవెల్స్ పడిపోయాయని వైద్యులు తెలిపారు.

Advertisement
Advertisement