మాదాపూర్‌లో అక్రమంగా నిర్మించిన ఓ భవనాన్ని కూల్చడంతో జీహెచ్‌ఎంసీ ఫెయిల్ అయింది.

హైదరాబాద్: మాదాపూర్‌లో అక్రమంగా నిర్మించిన ఓ భవనాన్ని కూల్చడంతో జీహెచ్‌ఎంసీ ఫెయిల్ అయింది. ఇంపిలోషన్ బ్లాస్టింగ్ పద్ధతి ద్వారా నిర్మాణాన్ని కూల్చివేస్తుండగా భవనం పూర్తిగా ధ్వంసం అవ్వలేదు. మళ్లీ కూల్చడానికి ప్రయత్నిస్తుండగా రాళ్లు ఎగిరిపడి ముగ్గురికి గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. సమాచారం ఇవ్వకుండానే జీహెచ్‌ఎంసీ బ్లాస్టింగ్ చేసిందని స్ధానికులు ఆరోపిస్తున్నారు.