రేపు ఉదయం 8 కల్లా...నిమజ్జనం పూర్తి | ghmc somesh kumar visits Hussensagar | Sakshi
Sakshi News home page

రేపు ఉదయం 8 కల్లా...నిమజ్జనం పూర్తి

Sep 8 2014 1:18 PM | Updated on Oct 20 2018 5:03 PM

ఘనంగా పూజలు అందుకున్న గణనాథులు నిమజ్జనానికి సిద్ధం అవుతున్నారు. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ సోమవారం ఏర్పాట్లను పర్యవేక్షించారు.

హైదరాబాద్ : ఘనంగా పూజలు అందుకున్న గణనాథులు నిమజ్జనానికి సిద్ధం అవుతున్నారు. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ సోమవారం ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంగళవారం ఉదయం ఎనిమిదిగంటల కల్లా నిమజ్జనం పూర్తయ్యేలా చూస్తామన్నారు. హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనమవుతున్న వినాయక విగ్రహాల శకలాలు ఎప్పటికప్పుడూ తొలగిస్తున్నట్లు తెలిపారు. సోమవారం దాదాపు అరవై వేలకు పైగా విగ్రహాలు నిమజ్జనం అవుతాయని అంచనా వేస్తున్నట్లు సోమేష్ కుమార్ అన్నారు.

మరోవైపు పాతబస్తీలో నిమజ్జన ఏర్పాట్లు పూర్తయ్యాయి. తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా నాయిని మాట్లాడుతూ నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా జరిగేలా చర్యలు చేపట్టామన్నారు. అందరూ మత సామరస్యాన్ని పాటించాలని నాయిని కోరారు. అన్ని ప్రాంతాల్లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు ఆయన చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement