‘బేగం’ సే ఆయా.. | GHMC Elections Special | Sakshi
Sakshi News home page

‘బేగం’ సే ఆయా..

Jan 22 2016 3:02 AM | Updated on Sep 3 2017 4:03 PM

‘బేగం’ సే ఆయా..

‘బేగం’ సే ఆయా..

రెండో అసఫ్‌జాహీగా సుప్రసిద్ధుడైన మీర్ నిజాం అలీఖాన్ బహదూర్ (1762-1803) తన కూతురు బషీర్ ఉల్ ఉన్నీసా బేగంను..

సాక్షి, సిటీబ్యూరో: రెండో అసఫ్‌జాహీగా సుప్రసిద్ధుడైన మీర్ నిజాం అలీఖాన్ బహదూర్ (1762-1803) తన కూతురు బషీర్ ఉల్ ఉన్నీసా బేగంను.. నవాబు ఫక్రుద్దీన్‌ఖాన్ షంషుల్ ఉమ్రా అమీన్ కబీర్‌కు ఇచ్చి పెళ్లి చేశారు. పెళ్లి సందర్భంగా విలువైన కట్నకానుకలు, బంగారు ఆభరణాలతో పాటు నగర శివారులోని ఓ  చిన్న గ్రామాన్ని జాగీర్‌గా వారికిచ్చారు. ఈ ప్రాంతం నుంచి వచ్చే రెవెన్యూ అప్పటి నుంచి బేగం సొంత ఖాతాలోకి చేరేది. నిజాం నవాబు తన కూతురు బేగంకు కానుకగా ఇచ్చిన ప్రాంతం కావడంతో ‘బేగంపేట’ అనే పేరొచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement