'నయీం 28 ఎకరాలు కబ్జా చేసి..మా వాళ్లను చంపేశాడు' | gangster nayeem victims complaints in ranga reddy district | Sakshi
Sakshi News home page

'నయీం 28 ఎకరాలు కబ్జా చేసి..మా వాళ్లను చంపేశాడు'

Aug 14 2016 11:15 AM | Updated on Apr 6 2019 8:55 PM

'నయీం 28 ఎకరాలు కబ్జా చేసి..మా వాళ్లను చంపేశాడు' - Sakshi

'నయీం 28 ఎకరాలు కబ్జా చేసి..మా వాళ్లను చంపేశాడు'

28 ఎకరాల పొలాన్ని నయీం గ్యాంగ్ కబ్జా చేయడంతో పాటు తన భర్త, కొడుకును పొట్టన పెట్టుకున్నాడని బాధితురాలు ఆరోపిస్తోంది.

హైదరాబాద్ : గ్యాంగ్స్టర్ నయీం అరాచకాలపై రాష్ట్రవ్యాప్తంగా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఎల్బీ నగర్, ఇబ్రహీంపట్నం, ఆదిభట్లలో నయీంపై ఆదివారం పెద్ద సంఖ్యలో పోలీసులకు ఫిర్యాదులు అందుతున్నాయి.

12 ఏళ్ల క్రితం తమ 28 ఎకరాల పొలాన్ని నయీం గ్యాంగ్ కబ్జా చేయడంతో పాటు తన భర్త, కొడుకును పొట్టన పెట్టుకున్నాడని బాధితురాలు మల్లమ్మ ఆరోపిస్తోంది. దీనిపై ఆమె స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆదిభట్లలో తమ బంధువులను కూడా నయీం ముఠా బెదిరించి భూ కబ్జాకు పాల్పడినట్లు ఆమె చెబుతోంది. కుటుంబ సభ్యులు మృతి చెందడంతో ఇళ్లల్లో పాచిపని చేస్తూ జీవనం సాగిస్తున్నానని, ప్రభుత్వం ఆదుకోవాలని మల్లమ్మ కోరుతుంది.

Advertisement
 
Advertisement
Advertisement