పారిశుద్ధ్య కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి | G kishan reddy takes on trs government | Sakshi
Sakshi News home page

పారిశుద్ధ్య కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి

Oct 1 2015 9:51 AM | Updated on Mar 29 2019 9:07 PM

పారిశుద్ధ్య కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి - Sakshi

పారిశుద్ధ్య కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి

జీహెచ్ఎంసీలో తొలగించిన పారిశుద్ధ్య కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే జి.కిషన్రెడ్డి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

హైదరాబాద్ : జీహెచ్ఎంసీలో తొలగించిన పారిశుద్ధ్య కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే జి.కిషన్రెడ్డి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పారిశుద్ధ్య కార్మికులను విధుల్లోకి తీసుకోవాలంటూ బీజేపీ ఎమ్మెల్యేలు గురువారం అసెంబ్లీ ఎదుట చీపుర్లు పట్టి రోడ్డు శుభ్రం చేశారు. అనంతరం కిషన్రెడ్డి మాట్లాడుతూ...  జీతాలు పెంచాలంటూ సమ్మె చేసిన 1200  మంది పారిశుద్ధ్య కార్మికులపై ఈ ప్రభుత్వం కక్ష కట్టి తొలగించిందని ఆయన ఆరోపించారు.

దీంతో దళిత వర్గాలకు చెందిన పేద కార్మిక కుటుంబాలు విధిన పడ్డాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం బేషజాలకు పోకుండా వారిని విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. పారిశుద్ధ్య కార్మికుల అంశాన్ని అసెంబ్లీలో లేవనెత్తుతామని కిషన్రెడ్డి స్పష్టం చేశారు.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement