కాంగ్రెస్కు పూర్వ వైభవం: ఉత్తమ్ | former glory on Congress : Uttam Kumar Reddy | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్కు పూర్వ వైభవం: ఉత్తమ్

Aug 7 2016 1:24 AM | Updated on Sep 19 2019 8:44 PM

కాంగ్రెస్కు పూర్వ వైభవం: ఉత్తమ్ - Sakshi

కాంగ్రెస్కు పూర్వ వైభవం: ఉత్తమ్

రాష్ట్రంలో కాంగ్రెస్‌కు బలమైన పునాదులున్నాయని, పార్టీకి పూర్వవైభవం వస్తుందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్‌కు బలమైన పునాదులున్నాయని, పార్టీకి పూర్వవైభవం వస్తుందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ సమావేశం గాంధీభవన్‌లో శనివారం జరిగింది. ఇందులో ఆయన మాట్లాడుతూ హైదరాబాద్‌లో కూడా పార్టీకి క్షేత్రస్థాయిలో కేడర్ ఉందన్నారు.

పార్టీని వార్డు, డివిజన్ స్థాయిలో కొత్త కమిటీలతో బలంగా తయారుచేయాలని నాయకులకు సూచించారు. సంస్థాగతంగా బలోపేతం చేయడం ద్వారా రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌పై పోరాటాలను పెంచాల్సిన అవసరముందని పేర్కొన్నారు. పార్టీ సీనియర్ నాయకులు బలరాం నాయక్, సర్వే సత్యనారాయణ, కూన శ్రీశైలంగౌడ్, భిక్షపతి యాదవ్, సుధీర్‌రెడ్డి, బండా కార్తీకరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement