సికింద్రాబాద్‌లో కారు బీభత్సం | drunken youth hulchul with car in secunderabad | Sakshi
Sakshi News home page

సికింద్రాబాద్‌లో కారు బీభత్సం

Feb 12 2017 11:14 AM | Updated on Sep 18 2019 3:26 PM

సికింద్రాబాద్‌లో కారు బీభత్సం - Sakshi

సికింద్రాబాద్‌లో కారు బీభత్సం

సికింద్రాబాద్‌లో ఆదివారం తెల్లవారుజామున కారు బీభత్సం సృష్టించింది.

సికింద్రాబాద్‌ : సికింద్రాబాద్‌లో కారు బీభత్సం సృష్టించింది. వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటన సర్దార్‌ పటేల్‌ రోడ్డులోని మారేడ్‌పల్లిలో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.

కారు ఇంటి ప్రహారి గోడను ఢీకొని కొద్ది దూరం లోపలికి దూసుకెళ్లింది. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఓ యువకుడితో పాటు ఇద్దరు యువతులు ఉన్నట్లు తెలుస్తోంది. మద్యం మత్తులో డ్రైవింగ్‌ చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. ప్రమాదం అనంతరం కారు నడిపిన యువకుడితో పాటు యువతులు కారు అక్కడే వదిలి పరారయ్యారు. కారు(కేఏ 51డి 5181) కర్నాటక రాష్ట్రానికి చెందినదిగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. కారులో మద్యంలో సీసాలు లభించినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement