చలానా తీసుకో.. వద్దు.. నాకు సెల్ఫీ కావాలి!

Drunken Man Shocked Police With His Behaviour In Secunderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో పట్టుబడితే.. పోలీసులు ఫొటో తీస్తారని భయపడి వెళ్లిపోయే వాళ్లను చూసుంటాము.. కనపడకుండా నంబర్‌ ప్లేట్‌కు అడ్డుపడే వాళ్లను చూసుంటాము.. చివరకు పోలీసుల కాళ్లా వేళ్లా పడేవాళ్లను చూసుంటాము. కానీ ఫోటో తీసి చలానా ఇస్తామంటే వద్దు సెల్ఫీ కావాలంటూ ఓ యువకుడు పోలీసులకే జలక్‌ ఇచ్చాడు. పోలీసులపై పంచుల మీద పంచులు వేస్తూ రెచ్చిపోయాడో యువకుడు.

ఈ సంఘటన శుక్రవారం సికింద్రాబాద్‌లో జరిగింది. వివరాల్లోకి వెళితే... సికింద్రాబాద్‌కు చెందిన రోహిత్‌ ఓ ప్రైవేట్‌ కంపెనీలో జాబ్‌ చేస్తున్నాడు. శుక్రవారం తప్పతాగి రోడ్డుమీద బైకు నడుపుకుంటూ బయలుదేరాడు. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు రోడ్డుమీద మెలికలు తిరుగుతూ వస్తున్న రోహిత్‌ బైక్‌ను గుర్తించారు. బైక్‌ ఆపడమే ఆలస్యం.. ఎంతకావాలి అంటూ పోలీసులను ప్రశ్నించాడు.

దీంతో పోలీసులు ఆశ్చర్యపోయారు. రోహిత్‌ అంతటితో ఆగలేదు. తాను రైల్వేస్టేషన్‌ దగ్గర మద్యం షాపు తెరిస్తే బోని చేసి వస్తున్నానంటూ పోలీసులకు పంచ్‌ వేశాడు. తన బైక్‌ను ఫోటో తీయనీయకుండా అరగంటపాటు పోలీసులను ఇబ్బందిపెట్టాడు. నానా తిప్పలు పడి పోలీసులు అతని బైక్‌ ఫోటో తీశారు. ఇంతలో సెల్ఫీ ప్లీజ్‌ అంటూ పోలీసులనే అడిగాడు. ఇలా మందు బాబు ఇచ్చిన షాకుల మీద షాకులతో పోలీసులు ఇబ్బందిపడిపోయారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top