హైదరాబాద్‌ పాస్‌పోర్టు అధికారిగా విష్ణువర్ధన్‌రెడ్డి | Dr.emmadi vishnu vardhan reddy appointed as hyderabad passport officer | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ పాస్‌పోర్టు అధికారిగా విష్ణువర్ధన్‌రెడ్డి

Feb 13 2017 9:54 PM | Updated on Sep 5 2017 3:37 AM

హైదరాబాద్‌ ప్రాంతీయ పాస్‌పోర్ట్‌ అధికారిగా ఎమ్మడి విష్ణువర్ధన్‌రెడ్డిని నియమితులయ్యారు.

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ ప్రాంతీయ పాస్‌పోర్ట్‌ అధికారిగా ఎమ్మడి విష్ణువర్ధన్‌రెడ్డిని నియమితులయ్యారు. విదేశీ మంత్రిత్వ శాఖ ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీచేసింది.

ప్రస్తుతం హైదరాబాద్‌ ప్రాంతీయ పాస్‌పోర్ట్‌ అధికారిగా ఉన్న అశ్విని సత్తారును ఢిల్లీకి బదిలీ చేశారు. ఈమె మినిస్ట్రీ ఆఫ్‌ ఎక్స్‌టర్నల్‌ ఎఫెయిర్స్‌లో రిపోర్టు చేయాల్సి ఉంది. కొత్తగా నియమితులైన డా.విష్ణువర్ధన్‌రెడ్డి త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈయన 2008 బ్యాచ్‌కు చెందిన ఐఎఫ్‌ఎస్‌ అధికారి. ఈయన గతంలో విదేశీ మంత్రిత్వ శాఖలో ఎక్స్‌టర్నల్‌ పబ్లిసిటీ సెల్‌లో అండర్‌ సెక్రటరీగా పనిచేశారు.

నెల రోజుల కిందటే ఆయన హైదరాబాద్‌ సచివాలయంలోని బ్రాంచ్‌ సెక్రటేరియట్‌కు బదిలీ అయ్యారు. ఇప్పుడు పాస్‌పోర్ట్‌ అధికారిగా నియమితులయ్యారు. ఈయనది వరంగల్‌ జిల్లాకు చెందిన వారని పాస్‌పోర్ట్‌ అధికార వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం హైదరాబాద్‌ ప్రాంతీయ పాస్‌పోర్ట్‌ కార్యాలయం పరిధిలో తెలంగాణలోని 10 జిల్లాలతో పాటు వైఎస్సార్‌ , కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు జిల్లాలు కూడా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని మిగతా జిల్లాలు విశాఖపట్నం పాస్‌పోర్ట్‌ కార్యాలయం పరిధిలోకి వస్తాయి.

Advertisement

పోల్

Advertisement