గాంధీ ఆస్పత్రిలో విధులు నిర్వర్తిస్తున్న వైద్యులు ఆందోళన బాటపట్టారు.
గాంధీ ఆస్పత్రిలో వైద్యుల ఆందోళన
May 8 2017 12:54 PM | Updated on Sep 5 2017 10:42 AM
సికింద్రాబాద్: గాంధీ ఆస్పత్రిలో విధులు నిర్వర్తిస్తున్న వైద్యులు ఆందోళన బాటపట్టారు. యూజీసీ స్కేల్ ప్రకారం వేతనాలు పెంచి.. అర్హులైన వైద్యులకు ప్రమోషన్స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టారు. తమ సమస్యలను తక్షణం పరిష్కరించకపోతే ఈ నెల 16 నుంచి అత్యవసర సేవలు నిలిపివేస్తామని వైద్యులు హెచ్చరించారు. నెల రోజులుగా రోజుకు గంట చొప్పున నిరసన తెలుపుతున్నామని మంత్రి లక్ష్మారెడ్డి ఇచ్చిన గడువు పూర్తయినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యల తీసుకోకపోవడంపై వైద్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
Advertisement


