'వెరిఫికేషన్ పూర్తైనవారికి రెగ్యులరైజ్ ఉత్తర్వులు జారీ' | CS Rajiv sharma review meeting over Contract employees regularisation | Sakshi
Sakshi News home page

'వెరిఫికేషన్ పూర్తైనవారికి రెగ్యులరైజ్ ఉత్తర్వులు జారీ'

Jun 16 2016 3:20 PM | Updated on Sep 4 2017 2:38 AM

కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణపై సీఎస్ రాజీవ్ శర్మ గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు అన్ని శాఖల నుంచి ఉన్నతాధికారులు హాజరయ్యారు.

హైదరాబాద్ : కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణపై సీఎస్ రాజీవ్ శర్మ గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు అన్ని శాఖల నుంచి ఉన్నతాధికారులు హాజరయ్యారు. శాఖల వారీగా రెగ్యులరైజ్ చేయాల్సిన ఉద్యోగుల వివరాలు సేకరించాలని ఆయన సూచించారు. ఇప్పటికే వెరిఫికేషన్ పూర్తైనవారికి రెగ్యులరైజ్ ఉత్తర్వులు జారీ చేయాలని ఈ సందర్భంగా ఉన్నతాధికారులకు ఆదేశించారు. ఇంతవరకు ఉద్యోగుల వివరాలు తేల్చని డిపార్ట్మెంట్లు వెంటనే పూర్తి వివరాలు ఇవ్వాలని ఆదేశించారు. వారం రోజుల్లో కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణపై మరోసారి సమావేశం కానున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement