గణేశ్ నిమజ్జనం ప్రశాంతంగా కొనసాగుతున్నదని సీపీ మహేందర్ రెడ్డి తెలిపారు.
ప్రశాంతంగా గణేశ్ నిమజ్జనం: సీపీ మహేందర్ రెడ్డి
Sep 5 2017 12:56 PM | Updated on Sep 12 2017 1:57 AM
హైదరాబాద్: గణేశ్ నిమజ్జనం ప్రశాంతంగా కొనసాగుతున్నదని సీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. బాలాపూర్ నుంచి ట్యాంక్ బండ్ వరకు శోభాయాత్ర కొనసాగుతుందన్నారు. అనుకున్న సమయానికే పూర్తవుతుందని, ట్యాంక్‌బండ్‌పైకి ఖైరతాబాద్ మహాగణపతిని తీసుకువచ్చామని వెల్లడించారు.హైదరాబాద్‌లో 12వేల విగ్రహాలకు జియోట్యాగింగ్ చేశామని చెప్పారు. ఎప్పటికప్పుడు విగ్రహాలు ఎక్కడ ఉన్నది తెలిసిపోతుందని ఆయన అన్నారు. రేపు ఉదయం కల్లా నిమజ్జనం ప్రక్రియ పూర్తవుతుందన్నారు.
Advertisement


