రోడ్డెక్కిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు | congress mals stage protest against Aadhar card link with ration | Sakshi
Sakshi News home page

రోడ్డెక్కిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

Mar 13 2014 2:30 PM | Updated on Mar 18 2019 7:55 PM

రోడ్డెక్కిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు - Sakshi

రోడ్డెక్కిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

రేషన్‌ సరుకులకు ఆధార్‌ అనుసంధాన్ని తొలగించాలంటూ రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు రోడ్డెక్కారు.

హైదరాబాద్ : రేషన్‌ సరుకులకు ఆధార్‌ అనుసంధాన్ని తొలగించాలంటూ రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు రోడ్డెక్కారు. హైదరాబాద్‌ లక్డీకాపూల్‌లోని రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. ఎల్బీనగర్‌, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్‌, శేరిలింగంపల్లి ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి, రాజేందర్‌, కూన శ్రీశైలంగౌడ్‌, రాజిరెడ్డి కలెక్టరేట్‌ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు.

జిల్లాలో 14 వేల కుటుంబాలకు ఈ నెల రేషన్‌ అందక అవస్థలు పడుతున్నారని, ఆధార్‌ లింక్‌ పెట్టి రేషన్‌ కోటాలో కోత విధించడంపై ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రేషన్‌ కార్డుదారులందరికీ సరుకులు ఇస్తామని జాయింట్‌ కలెక్టర్‌ హామీ ఇవ్వడంతో ఎమ్మెల్యేలు ఆందోళన విరమించారు.

Advertisement
 
Advertisement
Advertisement